వాహనదారులు రోడ్లమీద ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నడపాల్సొస్తుందని వాహనదారులు అంటున్నారు. వర్షాకాలం రాగానే విపరీతమైన వానలతో రోడ్లు పాడవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గజ్వేల్ నుండి చేగుంట వెళ్లే రహదారి గజ్వేల్ నియోజకవర్గంలోని ధర్మారెడ్డిపల్లి సమీపంలో రైల్వే గేట్ బ్రిడ్జి కింద రోడ్డుపై ఐరన్ బయటకు రావడంతో రోడ్డుపై వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటు నుండి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ రోడ్డు మరమ్మతు పూర్తిచేయాలని పలువురు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గత నెల రోజుల క్రితం ఇక్కడ ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంతో మృతి చెందారని గుర్తు చేశారు.
