ప్రాంతీయం

పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్

101 Views

పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సహాయ సహకారాలతో ఈరోజు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడం గారి ఆదేశానుసారం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమనరీ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్, పట్టణం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఫిజికల్ ట్రైనింగ్ శారీరక దృఢత్వ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అందరూ మొదటి మెట్టు ఎక్కడం జరిగిందని మరింత బాగా కృషి చేసి ఫిజికల్ టెస్ట్ లో మెరిట్ సాధించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా పురుషులకు 1600 మీటర్లు, రన్నింగ్ మహిళలకు మరియు 800 మీటర్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది, మరియు షాట్ పుట్, లాంగ్ జంప్ తదితర అంశాల గురించి తర్జుమా చేయడం జరుగుతుంది తెలిపారు. ఉద్యోగ సాధనకు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.శారీరిక దృఢత్వ శిక్షణలో విజయం ఎలా సాధించాలి 1600 పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్, చేసేటప్పుడు ఎలా మెరిట్ సాధించాలి చిన్న చిన్న మెలుకువల గురించి అవగాహన కల్పించారు. అభ్యర్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు శారీర దృఢత్వం శిక్షణ గురించి గ్రౌండ్ కు తప్పనిసరిగా రావాలని మరియు ప్రతి ఒక్కరూ టైం మెయింటెన్ చేయాలని మానసిక ప్రశాంతత గురించి యోగా మెడిటేషన్ చేయాలని సూచించారు ఇంటి ఆహారాన్ని తీసుకోవాలని రోజుకు తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలని డ్రంక్ ఫుడ్స్ బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దని 15 రోజులు కష్టపడితే విజయం మీ సొంతం అవుతుందని అభ్యర్థులకు భరోసా కల్పించారు. గజ్వేల్ శిక్షణ కేంద్రంలో 168 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు.గజ్వేల్ పట్టణంలో ఆర్ఎస్ఐ బాలకృష్ణ, ప్రభుత్వ పిఈటి టీచర్ల ఎలియాస్ రావు, శివ ప్రసాద్, నగేష్, అనంతచారి గార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel