Breaking News

నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవు కలెక్టర్

44 Views

*నిధులు దుర్వినియో దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ హెచ్చరించారు.డక్కిలి మండలము వెలుగు కార్యాలయము లోని డక్కిలి మండల సమాఖ్య లోని 27 గ్రామ సంఘాలలో జరిగిన నిధుల దుర్వినియోగం రూ. 1,05,68,405/-ల పై విచారణ జరిపిన అనంతరం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబందిత సిబ్బంది 7 మంది పై తగు చర్యల నిమిత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి లేఖ పంపడం జరిగినదని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా, వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరాదని, అందరూ జాగ్రత్తగా ప్రజలకు అంకిత భావంతో తమ సేవలను అందించాలని సూచించారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్