Breaking News

గూడూరు ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

40 Views


గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు సరి కాదు అని గూడూరు టీడీపీ నాయకులు పేర్కొన్నారు.మంగళవారం గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు శీలం కిరణ్ కుమార్ , నెలబల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సి మెరిగ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పై విమర్శలు చేయటం సబబు కాదు అన్నారు. వైసీపీ ప్రభుత్వా హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది అన్నారు. మీ ప్రభుత్వా హయాంలో గూడూరు నియోజక వర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు అన్నారు. అందుకే ప్రజలు వైసీపీ పార్టీ నీ చిత్తు చిత్తు గా ఓడించారు అన్నారు. గూడూరు నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారు అన్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేసే ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పేర్కొన్నారు. లేక పోతే భారీ మూల్యం చెల్లించు కోవలసి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు బిల్లు చెంచు రామయ్య , ఇజ్రాయెల్ , రహీమ్ , వాటం బెడు శివ కుమార్ , మల్లికార్జున్ రెడ్డి , పట్టాభి రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్