ప్రాంతీయం

మత్తు పదార్థాల పై యువత కు అవగాహన సదస్సు – సీపీ

49 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*మనస్సు మార్చుకోండి డ్రగ్స్ ను దూరం పెట్టండి..*

*పద్ధతి మార్చుకోకపోతే పీడీయాక్టే: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,*

*మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల నివారణకై అవగాహన సదస్సు*

*ఆనంద నిలయం లోని వృద్ధులకు, పిల్లలకు పోలీస్ చేయూత.*

గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారు ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేదంటే పీడీయాక్ట్ తప్పదని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  అన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం బట్టి వాడ లోని ఆనంద నిలయం ఆశ్రమం లో గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులకు, గంజాయి కి అలవాటైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో సత్ప్రవర్తన కలిగించాలని సదుద్దేశంతో వారితో ఆనంద నిలయంలో చెట్లు నాటించడం మరియు ఆశ్రమం ను పరిశుభ్రం గా ఉండేలా వారితో శ్రమ దానం చేయించడం జరుగుతుంది అన్నారు.

*ఈ సందర్బంగా సీపీ  మాట్లాడుతూ…* చిన్న వయసులో చెడు వ్యసనాలకు, గంజాయి కి బానిసలుగా మారిన యువత ను చూస్తే బాధ కలుగుతుందని, వారు కేసులలో ఇరుక్కుని వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. యువతను చెడు వ్యాసనాల బారి నుండి కాపాడుటకు పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ యవత నడవడికలో మార్పు రానట్లైతే, వారు తమ చెడు వ్యసనాలను కొనసాగించినచో వారి పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించినారు.

????మంచిర్యాల జోన్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంజాయి అమ్మినా, సరఫరా, సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని కేసులు నమోదు చేసి వారి పై నిరంతర నిఘా ఉంచుటకు షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అని పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.

????గంజాయి యుక్తవయస్సులో సేవించి దానికి అలవాటు పడి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఒక్క సారి గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు పడితే ఆర్దికంగా నష్ట పోతారని, ఆరోగ్యం చెడి పోతుందని అన్నారు.

????మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడుతే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు. ఒక్క సారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులు అవుతారు అని అన్నారు.

????చిన్న,చిన్న మొత్తాల్లో గంజాయిని ప్యాకేట్లుగా మార్చి యువతతో పాటు, చదువుకున్న విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే చెడు ఆలోచనతో కొంతమంది పక్క రాష్ట్రాల నుండి గంజాయిని వివిధ మార్గాల ద్వారా సేకరించి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇట్టి వ్యక్తులపై చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గంజాయిని సేవించే వారిపై చర్యలు తప్పవని, ఎవరైన గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు, సేవిస్తున్నట్లు సమాచారం వుంటే తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656597 కు, స్థానిక పోలీస్ లకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌  తెలియజేసారు.

ఆనంద నిలయం లోని అనాథ పిల్లలకు, వృద్ధులకు పండ్లు, బట్టలు సీపీ డీసీపీ మరియు ఇతర పోలీస్ అధికారుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది

అవగాహనా సదస్సులో మంచిర్యాల డిసిపి ఎ. భాస్కర్ ఐపీఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, మంచిర్యాల ఎసిపి ఆర్. ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మంచిర్యాల జోన్ పరిధిలోని సిఐలు ఎస్సైలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్