సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో నవ వధువు నవనీత వివాహానికి పుస్తే మట్టెలు, చీర, సారే, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 డి గవర్నర్ నగేష్ పంపాటి మాట్లాడుతూ గోలి సంతోష్ సేవలు అభినందనీయం అని నవ వధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ సేవ నిరతి కలిగి ఉండాలని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.
