ప్రాంతీయం

లయన్ నగేష్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం

66 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం స్థానిక ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ గోలి సంతోష్, లయన్ పరమేశ్వర చారి, లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవా అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డి గవర్నర్ నగేష్ పంపాటి జన్మదినం పురస్కరించుకొని హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, లయన్ నగేష్ పంపాటి జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ నగేష్ పంపాటి, లయన్ మర్రి ప్రవీణ్,లయన్ రామ్ ఫనిదర్ రావు, లయన్ శ్రీనివాస్ గౌడ్, లయన్ మల్లేశం గౌడ్,లయన్ రాజారాం, లయన్ బెల్దే సంతోష్, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7