ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

111 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి సోమవారం జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, నియోజకవర్గ కో ఆప్షన్ సభ్యులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎంతో చేయూతను అందిస్తుందని అన్నారు. మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోల్ కో ఆప్షన్ సభ్యులు హైమద్, ఇస్మాయిల్, హైమద్, కలిముద్దీన్, ఫర్వేజ్, హైమద్, దుబ్బాక మున్సిపల్ కోఆప్షన్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు ……

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *