నేరాలు రాజకీయం

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

51 Views

– సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్

జగదేవపూర్ , ఆగస్టు 20

సిద్దిపేట జిల్లా , జగదేవపూర్ : వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తునందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు బావులు నదులు నిండి ఉన్నాయి కాబట్టి
అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని,
ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ముట్టుకోకుండా ఉండాలన్నారు.పాఠశాల లు బంద్ ఉన్నాయి కాబట్టి పిల్లలను ఎక్కడికి వెళ్లకుండా తల్లి తండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.
వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇంట్లో కరెంట్ స్విచ్ బోర్డు వేసేటప్పుడు తడి చేతులతో ముట్టుకోవదని సూచించారు.
ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు, నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు. పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని, బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 100 కాల్ చేస్తే ప్రత్యేక సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్