రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తి తెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం అతని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుని వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
