హైదరాబాద్: అక్టోబర్ 14
24 57 తెలుగు న్యూస్ ప్రతినిధి
తమ తోటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో నిరుద్యోగులకు కడుపు మండింది. భారీ ఎత్తున యువత రోడ్లపైకి రావడంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ పరిస్థితులు గుర్తుకొచ్చాయి. నిన్న హైదరాబాద్ అశోక్ నగర్ లో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక (23) సూసైడ్ చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందని నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఎన్నో కష్టాలు పడుతున్న తమను సర్కార్ మోసం చేస్తుందని నినాదాలు చేశారు.
