గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ జ్ఞాన సంపద తో పాటు జీవిత లక్ష్యం కోసం మంచి విద్యను అలవర్చుకుని సమాజ సేవ కోసం నేటి విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యక్షుడు సంతోష్ గుప్త, స్థానిక కౌన్సిలర్ సమీర్, తెరాస పట్టణ కోశాధికారి కొమురవెల్లి ప్రవీణ్ కుమార్, ఎఫ్. ఎఫ్.యు. సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, ఆరిఫ్, సంపత్ కుమార్, బిక్షపతి, ప్రమోద్ చారి, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
