అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేటలో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది
సిద్దిపేట జిల్లా జూన్ 26
సిద్దిపేట జిల్లా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్య లు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నరని, పరిస్థితులకు భయపడి వారి తల్లి దండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చది వించడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పోరేట్ పాఠశా లల కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు అలాగే విద్య హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు 25%శాతం సీట్లను కేటాయించాలని, ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలన్నారు రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రి నియామకం చేసి, గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు. కావున ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది సిద్దిపేట లోని పాఠశాల యాజమాన్యాలు సహకరించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పరుశురాం, జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ప్రణయ్, నగర ఉపాధ్యక్షులు వివేక్, వసంత్, అభిరామ్,సంజయ్, శంకర్, రాకేష్, అభి, తదితరులు పాల్గొన్నారు.
