ప్రాంతీయం

కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం – రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి

123 Views

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని దొడ్లపల్లి గ్రామానికి చెందిన కె. సునీత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుని చికిత్సకు అయిన బిల్లులను, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేశారన్నారు. ఈ సీఎం సహాయనిది చెక్కును కె. సునీతకు 42,000/- వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని వైద్యానికి సంబంధించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి మంజూరు చేశారని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కెసిఆర్ కె దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బోనగిరి స్వామి, గుమ్మడి యాదగిరి, గుమ్మడి బిక్షపతి, కుమార స్వామి, బోనగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7