మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా పిసిసి పిలుపు మేరకు శుక్రవారం తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారి పై కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
కేటీఆర్ వెంటనే మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళలు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇకనైనా నీ దొర అహంకారం మాటలు మానుకోవాలని లేనియెడల కేటీఆర్ కు చెప్పు దెబ్బలు, చీపిరి దెబ్బలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.