Breaking News

బందును జయప్రదం చేయండి

165 Views

సడక్ బందును జయప్రదం చేయండి..

సెప్టెంబర్ 26

సిద్దిపేట జిల్లా  వీరన్నపేట: చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని చేర్యాల ప్రాంత జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 29 శుక్రవారం రోజున సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై ముస్త్యాల కేంద్రంగా నిర్వహించే సడక్ బందును జయప్రదం చేయాలని అధిక సంఖ్యలో వీరన్నపేట గ్రామస్తులు పాల్గొనాలని జేఏసీ మండల కన్వీనర్ మాజీ సర్పంచ్ బొమ్మగోని అంజయ్య పిలుపునిచ్చారు.

మంగళవారం రోజున వీరన్న పేట గ్రామంలో శుక్రవారం నిర్వహించే సడక్ బందును జయప్రదం చేయాలని ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో బొమ్మగోని అంజయ్య పాల్గొని మాట్లాడుతూ చేర్యాల ప్రాంతాన్ని గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదని ఒకప్పుడు 88 గ్రామాలతో ఒక వెలుగు వెలిగిన చేర్యాల పాత తాలూకా కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా చేర్యాల ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్రలు పన్నారని చేర్యాల ప్రాంతంలో చెప్పుకునే విధంగా ఎక్కడ అభివృద్ధి చేపట్టింది

లేదని కొన్ని మండలాలను హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాలను సిద్దిపేట రెవెన్యూ డివిజన్ గా ఇంకా ఏసీబీ పోలీస్ విభాగాన్ని విద్యుత్తు విభాగాన్ని హుస్నాబాద్ లో చేర్చి అగ్రికల్చర్ అండ్ ఆర్టికల్చర్ విభాగాన్ని గజ్వేల్ లో చేర్చి నియోజకవర్గం జనగామ ఎంపీ బోనగిరి ఈ రకంగా చేర్యాల ప్రాంత ప్రజలను పలు ప్రాంతాలకు వెళ్లే రకంగా అశాస్త్రీయంగా మార్చివేసి చేర్యాల ప్రాంత ప్రజల ఆత్మాభిమానాలను దెబ్బ తినే విధంగా నేటి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని గత 16 రోజులుగా చేర్యాల కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పట్టనట్టుగా వివరిస్తున్నారని ఈ పోరాటాన్ని ఉధృతం చేసేందుకై సడక్ బందు కార్యక్రమాన్ని ఎంచుకున్నామని

ఈ సడక్ బందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. వీరన్న పేట గ్రామం మేధావులు, యువకులు, రైతులు ,కార్మికులు వివిధ పార్టీల, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా ఈ సడక్ బందులో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ కొంగరి వెంకట్ మావో. జేఏసీ గ్రామ కన్వీనర్ మంజ మల్లేశం, పైస లింగం అరిగే బాలయ్య , ఎలికట్టే నామ్దేవ్, బింగి చంద్రం, ఎలికట్టే నాగేశ్వర్, అరిగే సత్తయ్య, బింగి బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *