విద్య

పాములపర్తి అంగన్వాడీ స్కూల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

47 Views

మర్కుక్ , ఆగస్టు 15

సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి అంగన్వాడీ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు గ్రామ యువత అందరూ కలిసికట్టుగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది.క్రీడల్లో పాల్గొన్న వారికి, గెలిచిన వారికి బహుమతులను బహుకరించడం జరిగింది. అదేవిధంగా జెండా వందనం సమయంలో పిల్లలు అందరూ కర్రోళ్ల బాలకృష్ణ డొనేషన్ చేసిన యూనిఫామ్ వేసుకుని స్కూలుకు రావడం జరిగింది.ఈ విధంగా పాఠశాలకు సహకరించిన బాలకృష్ణకి పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామ యువత సన్మాన చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు నీళ్లు తాగడానికి శర్ధని ప్రవీణ్ వాటర్ బబుల్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువత , గ్రామ పెద్దలు అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్