ప్రాంతీయం విద్య

ప్రపంచ శాంతికి మన -పల్లెటూరి పిల్లోడు నీల చంద్రం

72 Views

– ప్రపంచంలో ఉన్న పేద దేశాల శాంతి స్థాపన కోసం

– జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపిక

మర్కుక్ మండల ప్రతినిధి,జులై 22 (ప్రజా ప్రతిభ):

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే శాంతి సేన కోసం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపీక కావడం చాలా అభినందనీయమని సిద్దిపేట జిల్లా బిజెపి ఎక్స్ ఆర్మీ సెల్ కన్వీనర్ రిటైర్డ్ ఆర్మీ నీల చంద్రo ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యతరగతి రైతు కుటుంబం అయినా బొక్కి ముత్యాలు లక్ష్మి దంపతుల చిన్న కుమారుడైన వెంకటేష్ చిన్నప్పటి నుండే ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనే బలమైన కోరిక ఉండేది. దానికి అనుగుణంగానే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వెంటనే ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ లో చేరి 18 సంవత్సరాలలోనే ఆర్మీలో ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వెంకటేష్ 19 మద్రాస్ రెజిమెంట్ లో కార్యనియుక్తుడై ఉన్నాడు. ఈ మధ్యనే ఆర్మీలో అన్నిటికన్నా కష్టమైన రాష్ట్రీయ రైఫల్లో ఆంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో పాల్గొని వచ్చిన వెంకటేష్ ఆరు నెలలు తిరగకుండానే ఐక్యరాజ్యసమితి పరిధిలో పనిచేసే శాంతి సేనలో ఎంపిక కావడం ఈ సిద్దిపేట జిల్లాకే గర్వకారణమని నీల చంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మ నాన్నల ఆశీర్వాదంతో (యూ ఎన్ )మిషన్ లో భాగంగా లేబనాన్ దేశానికి వెళ్లి అక్కడ భారతదేశం యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పని చేసి రావాలని నీల చంద్రం ఆకాంక్షించారు. గంజాయి మత్తు పదార్థాల, మరియు ప్రేమ పెళ్లిల పేరుతో తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ మెట్లు వెక్కిస్తూ తల్లిదండ్రుల ప్రతిష్టను దిగజారుస్తూ మనోవేదనకు గురిఅయ్యేటట్లు చేస్తున్నా యువత,వెంకటేష్ లాంటి వారిని ప్రేరణగా తీసుకొని తమ ఎంచుకున్న రంగాలలో ఉన్నతoగా రానించి భారతదేశ ప్రతిష్టత మరియు గౌరవాన్ని పెంచాలని నీల చంద్రం ఈ సందర్భంగా కోరారు. బొక్కి వెంకటేశుని కలిసి అభినందించిన. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మమ్మద్ షఫీ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్