ఎల్లారెడ్డిపేట మండలం 14నవంబర్2023:-అక్టోబర్ 29వ తేదీన కరీంనగర్ లోని సేయింట్ జాన్స్ పాఠశాలలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల) ఖో ఖో అసోసియేషన్ సబ్ జూనియర్ (అండర్ 14) ఖో ఖో ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పపూర్ కు చెందిన డి.శ్రీజ, జి.రిషిత,ఏ. సంయుక్త ముగ్గురు విద్యార్తినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ మూడో తారీకు నుండి 13వ తారీకు వరకు కరీంనగర్లోని పారమిత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ముగించుకున్న ఈ ముగ్గురు విద్యార్తినిలు 15 నుండి 18 వరకు తూఫ్రాన్ లో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు.వీరిని ఉపాధ్యాయ బృందం అభినందించారు.
