ప్రాంతీయం

జాతీయ పక్షిని కాపాడిన ఆటవిశాఖ అధికారులు…

43 Views

ముస్తాబాద్, ఆగస్టు 8 (24/7న్యూస్ ప్రతినిధి): పంట పొలంలో కాలికి దెబ్బతగిలి గాయపడిన జాతీయపక్షి బంధనకల్ గ్రామంలోని తుపాకుల రామచంద్రంగౌడ్ రైతు పొలం వద్ద ఉన్న బావిలో నీళ్లల్లో కొట్టుమిట్టాడు రైతు మనసు చలించి ముస్తాబాద్ ఆంధ్రప్రభ రిపోర్టర్‌ను సంప్రదించారు. వెంటనే ఫారెస్ట్ అధికారి ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫారెస్ట్ అధికారి అంజలికి చరవాణితో సమాచారం అందించారు. స్పందించిన అధికారి హుటాహుటిన బంధనకల్ గ్రామానికి చేరుకొని నెమలి ప్రాణాలు కాపాడారు. ఆజాతీయ పక్షి నెమలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చిప్పలపెళ్లి గ్రామ శివారులోని ఏపుగాఉన్న ఆటవి ప్రాంతంలో వదిలామని అంజలి తెలిపారు. ఫోన్ చేసి సమాచారం అందించిన రైతును అభినందించిన శాఖ అధికారులు. సమయానికి స్పందించి జాతీయ పక్షిని కాపాడిన అధికారులను స్థానికులు ప్రశంసించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్