ప్రాంతీయం

జాతీయ పక్షిని కాపాడిన అటవిశాఖ అధికారులు…

268 Views

ముస్తాబాద్, ఆగస్టు 8 (24/7న్యూస్ ప్రతినిధి): పంట పొలంలో కాలికి దెబ్బతగిలి గాయపడిన జాతీయపక్షి బంధనకల్ గ్రామంలోని తుపాకుల రామచంద్రంగౌడ్ రైతు పొలంవద్ద ఉన్న బావిలో నీళ్లల్లో కొట్టుమిట్టాడుతుండడంతో రైతు మనసు చలించి ముస్తాబాద్ ఆంధ్రప్రభ రిపోర్టర్‌ను సంప్రదించారు. వెంటనే ఫారెస్ట్ అధికారి ఫోన్ నెంబర్ తెలుసుకొని అటవిశాఖ అధికారి అంజలికి చరవాణితో సమాచారం అందించారు. స్పందించిన అధికారి హుటాహుటిన బంధనకల్ గ్రామానికి చేరుకొని నెమలి ప్రాణాలు కాపాడారు. ఆజాతీయ పక్షి నెమలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చిప్పలపెళ్లి గ్రామ శివారులోని ఏపుగాఉన్న ఆటవి ప్రాంతంలో వదిలామని అంజలి తెలిపారు. ఫోన్ చేసి సమాచారం అందించిన రైతును అభినందించిన ఆటవిశాఖ అధికారులు. సమయానికి స్పందించి జాతీయ పక్షిని కాపాడిన అధికారులను స్థానికులు ప్రశంసించారు.

Screenshot_20240225_192336
Screenshot_20240225_192351
Screenshot_20240228_145757
IMG-20240316-WA0445
IMG-20240317-WA0338
IMG-20240319-WA0214
Screenshot_20240730_182428
Screenshot_20240730_183325
Screenshot_20240730_183346
Screenshot_20240730_183315
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్