ప్రాంతీయం

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం – బిజెపి

66 Views

*ప్రజల్లో విశ్వనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం – సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు *

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ప్రారంభం అయిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ గారు హాజరై సభుత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మంచిర్యాల బార్ అసోసియేషన్ లోని పలువురు న్యాయవాదులు బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో వారికి బీజేపీ సభ్యత్వ సభ్యత్వ కార్డులు హరీష్ బాబు , ఆకుల విజయ మరియు రఘునాథ్ వెరబెల్లి  అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా హరీష్ బాబు  మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వం పొందటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పది నెల్లలోనే ప్రజల్లో విశ్వనియత కోల్పోయింది అని ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడంలో విఫలం అయిందని అన్నారు. 2028 లో రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అరుముళ్ళ పోషం, ఎనగందుల కృష్ణ మూర్తి, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, మాజీ MLA అమరాజుల శ్రీదేవి, అక్కల రమేష్, మాసు రజినీ, గుండా ప్రభాకర్, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found