ఎస్సీ, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ, మాదిగ ఉపకులాల సంబరాలు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ వద్ద మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మాదిగ ఉపకులాల సభ్యులు, అదేవిధంగా ఎమ్మార్పీఎస్ నాయకులు గొడిసెల దశరథం మాట్లాడుతూ 1994, సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా “ఈదుముడి” గ్రామంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 20, మంది సభ్యులతో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైందని అప్పటినుండి గత 30 సంవత్సరాల ఉద్యమంలో ఎంతోమంది మాదిగ సోదరుల అమరుల ఫలితంగా ఈఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని ఈ యొక్క తీర్పు హర్షనీయమని అన్నారు,గడ్డం సత్యం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని,సుప్రీంకోర్టు మెజారిటీ బెంచ్ ఇచ్చిన తీర్పు భారత దేశ చరిత్రలో చారిత్రాత్మకమైనదని అన్నారు.
మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ జిల్లా ఇన్చార్జ్ కుంటాల శంకర్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటమే అంతిమ ఫలితాన్ని సాధించిందని, విద్యా, ఉద్యోగ, రాజకీయ, రంగాలలో తగిన ప్రతిఫలం దక్కుతుందని అన్నారు,ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ కి, వర్గీకరణ అంశం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ మెంబర్ జిల్లపెల్లి వెంకటేశం,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు గొడిసెల దశరథం,గడ్డం సత్యం,మోతే పోచయ్య,గొడిసెల రాజారాం,కుంటాల శంకర్,ఎలుక రాజు,ప్రవీణ్,కాంపెళ్లి చిట్టి,మేంత్రి సాయి,మెంత్రి రవి,పుల్లాల రవి,చిప్పకుర్తి నవీన్,ఆర్నకొండ శ్రీనివాస్,చిలక రాజమల్లు,లు పాల్గొన్నారు..
