రాముని చెరువు వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు.
తేదీ.. 4.8.2024 ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా ఆనందోత్సవాలతో నిర్వహించినారు.వాకర్స్ సభ్యులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాడ్జిలను కట్టుకొని ఆ లింగ నామం చేసుకొని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ స్నేహం అనేది గౌరవం మరియు నమ్మకం అనే రెండు విషయాలపై నిర్మించబడినదని నిజమైన స్నేహితుడంటే మన గతాన్ని అర్థం చేసుకొని బంగారు భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా అండగా ఉండేవాడు కష్ట నష్టాన్ని తోడుగా నిలిచేవాడు అలాంటి స్నేహితులను కలిగి ఉన్న అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.స్నేహానికి విలువ కట్టలేమని ఎంత ధనం పెట్టిన దొరకనిది స్నేహమని స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం కష్టమేమీ కాదని అంతటి త్యాగం చేసే స్నేహితుని పొందటమే కష్టమని వాకర్స్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డాక్టర్ వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రెటరీ సాగర్ల రవి సలహాదారులు కార్యవర్గ సభ్యులు జి సత్యనారాయణమూర్తి, ఏఈ అంజన్ రావు, Ex.CTO రవీందర్, రమణ, E.సత్యనారాయణ,టి శంకర్ శ్యాంసుందర్ టీచర్ శంకర్ మొగిలన్న,పాయలం మల్లన్న, ఒడ్నాల సత్యనారాయణ అడ్వకేట్, ఎన్ ఆర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.





