ముస్తాబాద్, ఫిబ్రవరి 29 (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి ని డా.గీతాంజలి అధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశాలు పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం సదస్సు నిర్వసించి పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా మండలంలో 32 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని 3,221 ఐదు సంవత్సరాలలోపు పిల్లలు మన ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటికే ఉన్నారు. ఆదివారం మార్చి నెలలో 3.నుండి తొలుతగా ప్రారంభించడం కానుంది మండల సమస్త ప్రజలకు తెలియపరుస్తూ సద్వినియోగం చేయాలని డాక్టర్ గీతాంజలి కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. తారభాయ్, పిహెచ్ఎన్ జ్యోతి, హెచ్ఇఓ.యాదగిరి, సూపర్వైజర్ లు ప్రసాద్, వరలక్ష్మిలు పాల్గొన్నారు.
