Breaking News ప్రకటనలు

వేములవాడ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

922 Views

అరుణాచలం వెల్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధి నుండి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలి వెల్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ఈ నెల 19 రాత్రి 8 గంటలకు వేములవాడ నుండి బయలు దేరి ఈ బస్సు కరీంనగర్ మీదుగా వెల్లి 20వ తేది రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని వివరించారు. ఈ బస్సులో వెల్లే ప్రయాణీకులు నేరుగా అరుణాచలానికి చేరుకోకుండా మార్గ మధ్యలో ఉన్న శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక, శ్రీ మహాలక్ష్మీ ఆలయాలతో పాటు గోల్డెన్ టెంపుల్ లను దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. అరుణాచల గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 21వ తేది రాత్రి 5 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న ఈ బస్సు గద్వాల జిల్లా జోగులాంబ శక్తిపీఠం మీదుగా 22 నాటి సాయంత్రం 6 గంటలకు వేములవాడ చేరుకుంటందని ఆర్ఎం సుచరిత వివరించారు. పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800 ఛార్జీలుగా నిర్ధారించామని వివరించారు. 7555 అనే సర్వీసు నెంబర్ పై ఆన్ లైన్ లో కూడా రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్