రాజకీయం

ఘనంగా ఎమ్మార్పీఎస్ దండోరా 30వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

62 Views

. ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ (జులై 7)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆద్వర్యంలో మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తయినందున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 60 సంవత్సరాల జన్మదిన వేడుకలను చేబర్తి లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెస్ ఎఫ్ మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం 18 మంది యువకులతో ప్రకాశం జిల్లా ఈదుమూడి లో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ దండోరా అంచలంచలుగా ఎదిగి దేశములో లక్షలాది మంది నాయకులతో ఎదిగి సుదీర్ఘ సామాజిక ఉద్యమంగా కొనసాగుతున్నదని,ఒకవైపు ఎస్సీ రిజర్వేషన్లను సమానంగా పంపిణీ జరగాలని బలంగా పోరాటం చేస్తూనే మరోవైపు బాధ్యతగల సామాజిక సంఘముగా సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల పట్ల ఆరోగ్యశ్రీ పథకంతో పాటు,వృద్ధులు వికలాంగులు,వితంతువులు,ఒంటరి మహిళలు సమాజంలో పీడించబడుతున్నటువంటి వర్గాల కోసం అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నదని,ఏ కులం పేరు చెప్పుకుంటే సిగ్గుపడి,బాధపడి,భయపడి,అవమానానికి లోనైనవారో అదే కులం పేరు చెప్పుకొని ఈరోజు సగర్వంగా నేను మాదిగ అని చెప్పుకోవడానికి మాదిగ దండోరా యావత్తు మాదిగ సమాజానికి కాకుండా అన్ని వర్గాలకు చైతన్యం చేసి ఈరోజు అన్ని కులాలు ఉద్భవించిన అంటే అది దండోరా వచ్చిన తర్వాతనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తా ఉన్నామని అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో జాతిని చైతన్యం చేస్తూ హక్కుల సాధనకైనా,అభివృద్ధికైనా ప్రగతి పథంలో నడిపేందుకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలతో పాటు,మంద కృష్ణ మాదిగ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ కేక్ కట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బొమ్మని మహేష్ మాదిగ,నాయకులు ఎల్కంటి కుమార్,చాట్లపల్లి శ్రీరామ్,చాట్లపల్లి యాదగిరి,బొమ్మని బాలకృష్ణ,ప్రభాకర్,రాజశేఖర్,అనిల్,ప్రదీప్,ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్