Breaking News

సాగు నిర్వహిస్తా

240 Views

మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలకు సాగు నిర్వహిస్తా

← Back

Thank you for your response. ✨

ముఖ్యమంత్రి కేసీఆర్

నవంబర్ 15 మెదక్ జిల్లా

మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపురం నియోజకవర్గాలను ఆయకట్టుకు నీళ్లు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వెస్లీ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని కోరారు. మెదక్లో గెలిచిన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. అదేవిధంగా మెదక్ లో రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు .పద్మ దేవేందర్ రెడ్డి తనకు కూతురు లాంటిదని ఆమె ఏది అడిగినా మంజూరు చేస్తానని తెలిపారు.

పరిపాలన చేతగాని కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు. కర్ణాటకలో ఐదు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని కానీ మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తుందన్నారు. అదేవిధంగా వచ్చే ప్రభుత్వంలో రైతులకు ఎకరాకు ఏడాదికి 16 వేల రూపాయల రైతుబంధు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 5 లక్షల రైతు బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతోపాటు ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందన్నారు ప్రజల తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది అన్నారు. రోడ్లు పరిశ్రమలు విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, ఐటి ,రంగంలో దేశంలోనే అగ్రగముగా ఉందన్నారు.

ఇంటింటికి నల్ల నీరు సరఫరా చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 24 గంటలకు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అన్నారు .మనం ప్రవేశపెట్టిన పథకాలని కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని ఆయన పేర్కొన్నారు .వచ్చే ఎన్నికల్లో పద్మ దేవేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెదక్లో అభివృద్ధి పనులను తాను నిలబడి చేయిస్తానని కేసీఆర్ అన్నారు.

ఈ ప్రజా ఆశీర్వాద సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జెడ్పి చైర్మన హేమలత శేఖర్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి , రైతుబంధు చైర్మన్ సోములు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ , తో పాటు జిల్లా పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *