సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ (పల్లెపహాడ్)లో ఇటీవల మరణించిన గూడూరి కొండయ్య కుటుంబాన్ని శనివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షుడు విజయ్ కుమార్ తన సోదరుడు కొమ్ము మల్లేశం సహకారంతో 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు మనవంతు సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి కలుగుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్ధూరి మల్లా రెడ్డి, సీనియర్ నాయకులు పంజాల రవి గౌడ్, దుర్గయ్య, భాను తదితరులు పాల్గొన్నారు.
