పక్క జిల్లా నుంచి రవాణా
తెలంగాణ మాల మహా నాడు అధ్యక్షులు శ్యాంబాబు
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14
గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్న గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికా రులు తమకు ఏమి పట్టనట్లు తీలిసిన తెలియనట్లు వ్యవ హారిస్తున్నారని తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాం బాబు అన్నారు.మంగపేట మండలం రాజుపేట పరిసర గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయని పక్క జిల్లా నుంచి పినపాక మండలం నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా గుడుంబాను ద్విచక్రా వాహనల పై తీసుకొని వచ్చి గ్రామం ఇస్తున్నారని పేద మధ్య తరగతి ప్రజలు వివిధ రసాయనలతో తయారు చేసిన గుడుంబాను తాగి తీవ్ర అనారోగ్యం భారీన పడి పలువురు ఇప్పటికే మృతి చెందారని రోజు కూలి పనికి వెళ్తేనే పూట గడిచే కుటుంబంలో గుడుంబాకు బానిసలుగా మారి డబ్బులు ఖర్చు చేస్తూ ప్రాణాలు కూడ పోగొట్టుకున్న వారు ఉన్నారు ఒక పక్క సీజనల్ వ్యాధులతో హాస్పిటల్ పలై మరో వైపు గుడుంబా బారిన పడి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని పేరుకు మాత్రమే ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారని గుడుంబా అమ్మకాలు వారి కనుసనల్లోనే జరుగుతు న్నాయా? అనే అనుమానం వస్తుందని అన్నారు.ఇప్పటి కైనా సంబందిత అధికారులు గుడుంబా అమ్మకాలను అరికట్టి మా శాఖ ఉంది అని ప్రజలు భరోసా నివ్వాలని తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాం బాబు కోరుతున్నారు.