ప్రాంతీయం

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

97 Views

దౌల్తాబాద్: నిరుపేదలకు సీఏంఆర్ఎఫ్ వరంగా మారిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. గురువారం మండల పరిధిలోని అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ కు 20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమాంబీ, ఎంపిటిసి తిరుపతి, నాయకులు జానిబి, మస్తాన్ పఠాన్, రఫీ, షఫీ, షేక్ అలీ, భాస్కర్, యూసుఫ్, మొయిన్, సాద్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh