ముస్తాబాద్ జూలై 6 (24/7న్యూస్ ప్రతినిధి): కూటికోసం కోటి తిప్పలు అన్నట్లుగా పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి గుండెపోటు. ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట గ్రామానికి చెందిన పిట్ల మహేష్ తండ్రి నరసయ్య ముదిరాజ్ అతను కుటుంబ పోషన భారమై విదేశాలు వెళ్లిన మహేష్ సౌదిలో గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. మరణ వార్త విన్న కుటుంబీకలు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుడు సుమారుగా 15 సంవత్సరాలుగా విదేశాలకు వెళ్తూ ఇటీవల 5. నెలల కింద ఇంటికివచ్చి తిరిగి వెళ్ళాడని గ్రామస్తులు తెలిపారు. ఆయన మరణంతో కుటుంబమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె కలరు. ముస్తాబాద్ గల్ఫ్ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీటి నర్సింలు, పుల్లూరి రవి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి విదేశంలో ఉన్న మహేష్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్ల కొరకు మంత్రులు చొరవ చూపాలని పలు విధాల ప్రస్తావన చేస్తున్నామని తెలిపారు.
