ప్రాంతీయం

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

116 Views

దౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కిషన్, ఏఈఓ సంతోష్ కుమార్, సిసి రాజేశ్వరరావు, ఉప సర్పంచ్ సాయి కృష్ణ, సిఎ సంగీత, రైతులు పెరుమయ్య, సుధాకర్, స్వామి, భూషణం, శ్రీనివాస్, నర్సింలు, లింగం, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh