రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ గ్రామం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మూడు గ్రామాల సర్పంచ్ లు కార్యదర్శులు సిరిగిరి లక్ష్మీ, బాల్య నాయక్ , పొన్నాల నారాయణ , కార్యదర్శులు చంద్ర శేఖర్ ప్రవీణ్ శుష్మ గార్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మరుగుదొడ్ల వినియోగం పై అవగాహన కల్పించడం జరిగింది అని శ్రీ బోయన్నగారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగు దొడ్లు ముద్దు బహిర్భూమి వద్దు అని అన్నారు మరుగు దొడ్లు వినియోగిస్తూ మహిళల ఆత్మ గౌరవం ను కాపాడాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఎస్ ఎంసీ చేర్మెన్ సిరిగిరి చంద్ర మౌళి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
