ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
– హాజరైన ఎక్సైజ్ సీఐ జె . ఇంద్రప్రసాద్ మరియు సిబ్బంది
– ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం
బెల్లంపల్లి: జీవితాలను చిన్నాభిన్నం చేసే మాదకద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థిని, విద్యార్థులు ప్రజలు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ ఇంద్ర ప్రసాద్ గారుకోరారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ ల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు అప్రమత్తం కావాలి
డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా ఉంటే అందమైన భవిష్యత్తు సొంతమవుతుందని ఎక్సైజ్ సిఐ ఇంద్రప్రసాద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందిస్తున్న డిగ్రీ ఉన్నత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణించాలని ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి ఉన్నత భవిష్యత్తుకు విద్యార్థి జీవితం పునాదిరాయిలా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పి. శ్రీలత, ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్, ఎస్ఐ, శారద కానిస్టేబుళ్లు, శిరీష శ్రీలత విజయ గణేష్ సతీష్ గౌడ్ వాజిదిన్ దినేష్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
