రోడ్డు మరమ్మతుల గురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది
సిద్దిపేట్ జిల్లా మిరుదొడ్డి జూన్ 26
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల ఎంపిటిఓ కార్యాలయంలో సూపరిండెంట్ నారాయణ కి రోడ్డు మరమ్మతుల గురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మాట్లాడుతూ మండల కేంద్రంలో మల్లుపల్లి నుండి వీరారెడ్డిపల్లి వరకు ఉన్నటువంటి మట్టి రోడ్డును తొలగించి దాని ప్రాంతంలో తారు(దాంబర్) రోడ్డు వేయాలని మరియు ఆ మట్టి రోడ్డు మీద వర్షాకాలంలో వెళుతున్న సమయంలో అది గుంతలు గుంతలుగా ఉండడం జరుగుతా జరుగుతుంది. వర్షాకాలంలో ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్డు వేయలేకపోవడం జరిగింది.ఏమైనా అంటే రోడ్లు సాంక్షన్ అయ్యాయి కానీ మెల్లిగా చేస్తామనేటువంటి మాటలు చెప్పడం జరుగుతా ఉంది.అంతేకాకుండా ఆ రోడ్డు యొక్క మరమ్మత్తులు తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని ధర్మసమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అలాగే దుబ్బాక నియోజకవర్గం లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మారుమూల గ్రామాలలోకి వెళ్లడానికి రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. బస్సులు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక్క సైడు నుండి బైకు వస్తే ఇంకో సైడ్ నుండి పెద్ద వెహికల్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల బతుకులు మాత్రం ఏ మాత్రం మారడం లేదు ఇప్పటికైనా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామాలలో సరైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీతరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.ధర్మ సమాజ్ పార్టీ నిత్యం ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో అక్బర్ పేట_భూంపల్లి మండల అధ్యక్షులు కనకమల్లేశం మండల నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
