మాజీ సీఎం కేసీఆర్ తో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా మర్కుక్ జూన్ 25
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ కు 9 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు కెసిఆర్ తో మంగళవారం రోజున మధ్యాహ్న సమయంలో సమావేశం అయ్యారు ఉదయాన్నే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు కెసిఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళుతున్న విషయం గురించి చర్చించినట్లు సమాచారం. మిగిలిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ నేతలకు భరోసా కల్పించడం, పార్టీ భవిష్యత్తు వ్యూహం పై ముఖ్య నేతలకు గులాబి పార్టీ అధినేత కెసిఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో వేముల ప్రశాంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే వివేకానంద, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కుకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే గాంధీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మెదక్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్సీ దండం విట్టల్ తదితర నాయకులు పార్టీ నేతలు పాల్గొన్నారు.
