(కరీంనగర్ జూన్ 25 )
పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని సీడీపిఓ సబితా కుమారి అన్నారు. మంగళవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. పిల్లల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల పిల్లల ఎత్తు బరువు చూడాలని దీనికి పిల్లల తల్లులు ప్రత్యేక చొరవ తీసుకొని అంగన్వాడి సెంటర్లో సంప్రదించాలని సూచించారు. ఎత్తు బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సల్ల శారద, డాక్టర్ ప్రణీత,ఏఎన్ఎం లు రోజా,శ్రీవాణి,అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.