ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన
విద్య -ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కుక్ జూన్ 25
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఇప్పలగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ బోరబండ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిల్స్ కంపాక్స్ బాక్స్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తారని పేర్కొన్నారు.
అలాంటి పిల్లలకు జై ఆర్యవైశ్య సేవా సమితి, అనంతలక్ష్మి చారి కేబుల్ ట్రస్ట్ సభ్యులు నోటు పుస్తకాలు, బ్యాగులు అందించడం అభినందనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల సేవా సమితి సభ్యులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శంకర్, ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, రవి గుప్తా, విఎస్ రావు, భూమేష్ గుప్తా, చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
