దౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇప్పటికైనా కెసిఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేల్కొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఆయన అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్బి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆడెపు రవికుమార్, లోకేష్, బంటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
