తొగుట; తొగుట మాజీ ఉప సర్పంచ్ ముచ్చర్ల మల్లేశం అకాల మరణం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు..తొగుటలో ఆయన పార్థీవ దేహాన్ని దర్శించి ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.. అందరి తలలో నాలుకగా ఉన్న మల్లేశం మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు.. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేష్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, టీచర్ నర్సింహారెడ్డి, భాస్కర్ గౌడ్, పబ్బతి వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, చెన్నారెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు..
