ఏబీవీపీ సిద్దిపేట నూతన నగర కార్యదర్శి గుగులోతూ పర్శారాం.
సిద్దిపేట జిల్లా జూన్ 25
సిద్దిపేట జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం నూతన నగర కమిటీ ప్రకటన.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట సంఘటన మంత్రి లక్ష్మీపతి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి జాతీయ పునర్నిర్మాణం జాతీయ భావాలను నింపుతున్న విద్యార్ధి పరిషత్ గురించి దిశా నిర్దేశం చేశారు అనంతరం స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బీరకాయల వివేక్ వర్ధన్ నూతన నగర కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా నూతన నగర కార్యదర్శిగా గుగులోత్ పరశురాం, నగర సంయుక్త కార్యదర్శిలుగా రాకేష్, మారుతి, ఉపాధ్యక్షులుగా నందు, ఫణిందర్, సోషల్ మీడియా కన్వీనర్ గా అనీష్, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ గా అభిరామ్ లను ప్రకటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సావుల ఆదిత్య, పవన్, విభాగ్ సోషల్ మీడియా సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
