….యువకులకు వాలీబాల్ సెట్ అందజేత
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ మన గ్రామ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు అయినటువంటి చింతకాయల స్వామి మాస్టర్ యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మరియు ఆటపాటలతో గడిపి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో, మన గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వాలిబాల్ కోర్టుకు సంబంధించిన నెట్టు మరియు రెండు బాల్స్ ను యువతకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు PACS వైస్ చైర్మన్ బాలరాజు(jdpr) మరియు గ్రామ వార్డుమెంబర్స్ శేఖర్ , నవీన్ రెడ్డి ,.శ్రీశైలం మరియు కుంట యాదగిరి బాలచంద్రం, PET సత్యం మాస్టర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఎర్రవలి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు కృష్ణMsd , ప్రభాకర్ పొట్టొల్ల, ఆవుల కాడి కనకయ్య, నారని రాజు, ఇస్తారి శ్రీను, శ్రీకాంత్, రాజు, కరుణాకర్, నవీన్,అభి, కార్తీక్, సందీప్ లు స్వామి మాస్టర్ శాలువాతో సత్కరించారు.ఇ లాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి ఎర్రవల్లి గ్రామ యువతకు ఆదర్శంగా నిలవాలని చింతకాయల స్వామి మాస్టర్ కోరుకుంటున్నారు





