వ్యవసాయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

61 Views

-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

(తిమ్మాపూర్ జూన్ 23 )

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి మిఠాయి పంచి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రేణికుంట గ్రామ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు ఎలుక రాజు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం రైతులకు ఎంతో మేలు అని అన్నారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది అని అన్నారు. ఆగస్టు 15, 2024 లోపు 48 లక్షల మంది రైతుల రుణాలను సుమారు 31 వేల కోట్ల తో రుణమాఫీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రేణికుంట గ్రామ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..

ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలు, మహిళలు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్