ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 23
సిద్దిపేట జిల్లా మర్కుక్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 1990 – 91 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం అట్టహాసంగా జరుపుకున్నారు,అధ్యాపకులకు చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు,అనంతరం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుని,ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అర్థం లక్ష్మణ్ మాట్లాడుతూ చిన్న నాటి మిత్రులం అందరం ఒక చోట కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవటం సంతోషంగా ఉందని మాకు విద్య బుద్ధులు నేర్పిన అధ్యాపకులకు చిరు సన్మానం చేయడం జరిగిందని ఎన్నో రోజులుగా ఆత్మీయ సమ్మేళనం జరుపు కోవాలని అనుకోవడం జరిగిందని ఈరోజు అందరం ఒకే చోట కలిసి కష్ట సుఖాలు చర్చించుకోవడం జరిగింది అని స్నేహానికన్న లోకాన మిన్న ఏదీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంజీవరెడ్డి, పండరి,సత్యనారాయణ, కరిమొద్దిన్, పూర్వ విద్యార్థులు మాధవ రెడ్డి, కృష్ణ మూర్తి,మాధవ రెడ్డి,నాగరాజు, బాల కిషన్,అన్నపూర్ణ,సరళ, సూర్య కళ, హేమ లత, రామ గీత తదితరులు పాల్గొన్నారు
