విద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

69 Views

(తిమ్మాపూర్ జూన్ 23 )

తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002-03 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు..

ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు.21 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు తమకు విద్య నేర్పిన గురువులను పూలదండలతో సన్మానించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు పరబ్రహ్మమూర్తి చనిపోయిన విషయం తెలుసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి, నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు సునీత, వెంకటరెడ్డి, రాజ మొగిలి, హమీద్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్