వ్యవసాయం

రైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి

83 Views

రైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం:(జూన్ 24)
వరి సాగు చేసే రైతులు సకాలంలో వరి నార్లు పోసుకోవాలని మండల రైతులకు వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నారుమడ్ల పట్ల పలు సూచనలు సూచించారు. మర్కూక్ మండలంలో వివిధ గ్రామాల్లో నారు మళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలలో రైతులు వానాకాలంలో నార్లు ఆలస్యంగా పోసుకుంటున్నారని దీని ద్వారా పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు తొందరగా నార్లు పోసుకుంటే యాసంగిలో ముందుగా వరి వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. మరియు యాసంగి పంట సమయంలో వడగండ్ల వర్షాలు కురిసి వడ్లు రాలిపోవడం వల్ల రైతుల నష్టపోతున్నారని రైతులకు జాగ్రత్తలు వివరించారు. కావున రైతులు దీర్ఘకాలిక రకాలను (150 రోజుల) జూన్ చివరి వరకు మద్దకాలిక రకాలను (135 రోజులు) జూలై 15 లోపు స్వల్పకాలిక రకాలను(120రోజులు) జూలై చివరి వరకు నార్లు పోసుకోవాలి అని సూచించారు. నారుమడిని బాగా దున్నిన తర్వాత అనగా రెండు లేదా మూడు సార్లు దమ్ముచేసి చదును చేసుకోవాలి అని మండల రైతులతో అన్నారు. నారు మడిలో కొంచెం ఎత్తులో నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకుంటే మంచిదనీ అన్నారు.ఎకరానికి సరిపడే నారుమడికి విత్తనం చల్లెముందు కిలో నత్రజని, 12-14 రోజులకు మరో కిలో నత్రజని వేసుకోవాలని అన్నారు. కిలో భాస్వరం, కిలో పొటాష్‌ ఎరువులను దుక్కిలో చల్లుకోవాలని సూచించారు. జింకు లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలని అన్నారు. మెట్ట నారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే సరిచేసుకోవాలని మరియు నారు పీకే ఏడు రోజుల ముందు ఒక్కో గుంట విస్తీర్ణానికి 400 గ్రాముల కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలు ఇసుకలో కలిపి చల్టుకోవాలిని పలుచగా నీరు ఉంచాలని మండల రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రజినీకాంత్,రైతులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్