ఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని ఒకటవ వార్డు చెందిన గౌరీ గారి పద్మ ( 48 ) అనే మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చాయి ,
ఈ సంఘటనలో ఆమే కూడి కాలుకు గాయాలయ్యాయి కాగా
ఆమే ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది,
ఒకటవ వార్డు లో పందులు కోతులు స్వైరా విహారం చేస్తున్నాయని పట్టించుకునే నాథుడే లేడని ఒకటవ వార్డుకు చెందిన మల్లయ్య , బాలయ్య ధర్మయ్య ,రాజు లు తెలిపారు,
కోతులు పందుల బెడదతో ప్రతి రోజు తాము ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు, వాటి దాడులను తట్టుకోలేకపోతున్నామని అవి ఎవరి ఇళ్ళు లూటీ చేస్తాయో ఎవరి పై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ,
గత శనివారం కోతులు గౌరి గారి పద్మ పై దాడి చేయగా ఆమే కుడి కాలుకు గాయమై అస్వస్థతకు గురి అయిందని ఆమే ఆర్థికంగా నష్టపోయిందని ఇంత జరిగిన గ్రామపంచాయతీ వాళ్లకు వర్గం కుట్టించుకున్న పాపం పోలేదని విమర్శించారు, ఇప్పటికైనా కోతుల పందుల బెడదా నుంచి తమకు కాపాడల్ని వారి విజ్ఞప్తి చేశారు
