ఎల్లారెడ్డిపేట నవంబర్ 18 :
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ప్రభాకర్ రావును కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పుష్పగుచ్చమించి అభినందనలు తెలియజేశారు,
టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన మొదటి తరం నాయకులు ప్రభాకర్ రావు అని ఆయన సేవలను గుర్తించి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు కు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు
