*పోడు రైతులను ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం – సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*
*హైదరాబాద్ :* ఈరోజు నాంపల్లి లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మరియు ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల శంకర్.
*ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్యను ఫారెస్ట్ అధికారులు జటిలం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పోడు భూములలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఇల్లందు వరకు ప్రాణహిత మరియు గోదావరి పరివాహక ప్రాంతంలో పోడు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.*
ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు దాష్టీకాలకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు. పట్టా భూములలో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇది అన్యాయమని అన్నారు.
*వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫారెస్ట్ అధికారులను కట్టడి చేయాలని, పోడు రైతుల జోలికి ఫారెస్ట్ అధికారులు వెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి పోడు రైతుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.*
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా. శిల్పారెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముస్తాపూరే అశోక్ పాల్గొన్నారు.
